సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించిన స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (57) అవుటయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడిన రాహుల్ 24 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశాడు. అయితే కేశవ్ మహరాజ్ వేసిన 12వ ఓవర్లో స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
కేశవ్ వేసిన బంతిని రాహుల్ మిస్ అవడంతో అది అతని ప్యాడ్లను తాకింది. అంపైర్ అవుటిచ్చినా రాహుల్ రివ్యూ కోరాడు. రిప్లేలో కూడా అతను అవుటని తేలడంతో నిరాశగా మైదానం వీడాడు. దీంతో భారత జట్టు 107 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.