సఫారీలతో జరుగుతున్న రెండో టీ20లో భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపుతున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడిన అతను కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అంతకుముందు రాహుల్ (57) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. సౌతాఫ్రికా పేసర్లు చెత్త బంతులు వేయడంతో సూర్య వాటిని శిక్షిస్తున్నాడు. సూర్య బాదిన భారీ షాట్లలో ఎక్కువ శాతం ఫుల్టాస్లే ఉండటం గమనార్హం.