సూపర్ ఫామ్‌లో ఉన్న సఫారీ బ్యాటర్ వాన్ డర్ డస్సెన్ (52) అవుటయ్యాడు. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు అతను ప్రయత్నించాడు. అయితే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. డైవ్ చేస్తూ అందుకున్న సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో డర్ డస్సెన్ ఇన్నింగ్స్ ముగిసింది.
వరుస ఓవర్లలో డీకాక్ (124), వాన్ డర్ డస్సెన్ (52) వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా ఇబ్బందుల్లో పడింది. ఆదినుంచి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన సఫారీలు.. చివర్లో కొంత తడబడటంతో ఆ జట్టు ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మిల్లర్‌తోపాటు ఫెహ్లుక్వాయో ఉన్నాడు.
Stop the press!
— 🏏FlashScore Cricket Commentators (@FlashCric) January 23, 2022
India have found a way to dismiss Rassie van der Dussen.
LIVE COMMS:
👉 https://t.co/fxjTjGorwV 👈 #INDvSA | #INDvsSA | #SAvIND pic.twitter.com/wxvLfzeTkm