నిర్ణయాత్మక మూడో వన్డేలో సౌతాఫ్రికా జట్టు మరో వికెట్ కోల్పోయింది. వెటరన్ ఓపెనర్ క్వింటన్ డీకాక్ (6) త్వరగా పెవిలియన్ చేరడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్న జానెమన్ మలన్ (15) కూడా పెవిలియన్ చేరాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన 8వ ఓవర్లో డీప్ స్క్వేర్‌లో క్యాచ్ ఇచ్చిన అతను అవుటయ్యాడు. అప్పటి వరకు అక్కడ ఫీల్డర్ లేకపోవడం గమనార్హం.
ఈ డెలివరీ కోసమే ప్రత్యేకంగా అక్కడ ఫీల్డర్‌ను ఉంచాడు ధవన్. ఈ క్రమంలో సిరాజ్ వేసిన షార్ట్ బాల్‌ను పుల్ చేసేందుకు ప్రయత్నించిన మలన్ ఒక్క క్షణం ఆలస్యమయ్యాడు. దాంతో బంతి అతను అనుకున్నంత దూరం వెళ్లలేదు. బౌండరీ రోప్ ఇవతలే ఆవేష్ ఖాన్‌కు సులభమైన క్యాచ్ దొరికింది. దీంతో 8 ఓవర్లకు సఫారీ జట్టు 25/2 స్కోరుతో నిలిచింది.