సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌పై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. అంతర్జాతీయ స్థాయిలో తొలి మ్యాచ్ కెప్టెన్సీ చేసిన పంత్.. ఓటమితోనే కెప్టెన్సీ అరంగేట్రం చేశాడు.
ఈ సందర్భంగా భారత జట్టు మాజీ ఓపెనర్, పలు సందర్భాల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరున్న గంభీర్.. తానైతే భారత జట్టు కూర్పులో చిన్న మార్పు చేసేవాడినని చెప్పాడు. వెటరన్ దినేష్ కార్తీక్ బదులుగా ముందు దీపక్ హుడాకు అవకాశం ఇచ్చేవాడినని చెప్పాడు.
‘‘ఇప్పుడు దినేష్ కార్తీక్‌నే ఎంచుకున్నారు కాబట్టి.. అదే కొనసాగించాలి. కానీ నేనైతే దీపక్ హుడాను ఆడించేవాడిని. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. దానికితోడు యువకుడు. అయితే.. వచ్చే మ్యాచ్‌లలో భారత జట్టులో మార్పులు చేయాలని కూడా నేను చెప్పను. పిచ్ మరీ డ్రైగా ఉంటే తప్ప జట్టులో మార్పులు చేయొద్దు’’ అని సూచించాడు. మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. జట్టును అనవసరంగా మార్చుకోవద్దని, ఇదే జట్టును కొనసాగించాలని సూచించాడు.