భువనేశ్వర్ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్ తన రెండో ఓవర్లోనే సత్తా చాటాడు. భారత బౌలింగ్ దాడిని ప్రారంభించిన అతను.. మూడో ఓవర్లో ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జానెమన్ మలాన్ (1)ను పెవిలియన్ చేర్చాడు.
చాహర్ వేసిన అద్భుతమైన డెలివరీని ఆడేందుకు ప్రయత్నించిన మలాన్ విఫలమయ్యాడు. దీంతో అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్ కీపర్ పంత్‌కు చిక్కింది. దీంతో మలాన్ ఇన్నింగ్స్ ముగిసింది.
అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ టెంబా బవుమా(8 నాటౌట్), డీకాక్ (24 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. అయితే ఈ జోడీని కెప్టెన్ కేఎల్ రాహుల్ విడదీశాడు. అద్భుతమైన డైరెక్ట్ త్రో విసిరి బవుమాను పెవిలియన్ చేర్చాడు. దీంతో సఫారీ జట్టు 34 పరుగులకే రెండో వికెట్ కోల్పోయింది.
Captain to captain & Rahul wins this battle.
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) January 23, 2022
LIVE COMMS:
👉 https://t.co/fxjTjGorwV 👈 #INDvSA | #INDvsSA | #SAvIND pic.twitter.com/2QV4fX33yc