భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటింగ్ యూనిట్ కుదేలైంది. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును ఆదుకుంటాడని అనుకున్న కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (7) కూడా నిరాశ పరిచాడు. వాషింగ్లన్ సుందర్ వేసిన సూపర్ డెలివరీని ఆడటంలో విఫలమయ్యాడు మిల్లర్. దీంతో ఆ బంతి ఆఫ్‌స్టంప్‌ను తాకి బెయిల్స్ పడగొట్టింది.
అయితే బంతి తగిలే బెయిల్స్ కింద పడ్డాయా? అని అనుమానం నెలకొంది. దీంతో థర్డ్ అంపైర్‌ను సంప్రదించగా.. స్లో మోషన్లో చెక్ చేశారు. రిప్లేలో బంతి తగిలే బెయిల్ కింద పడినట్లు స్పష్టమైంది. దీంతో మిల్లర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. సౌతాఫ్రికా జట్టు 19 ఓవర్లలో 67 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కుల్దీప్ యాదవ్ వేసిన మరుసటి ఓవర్లోనే సఫారీ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. వచ్చీరావడంతోనే బౌండరీ బాదిన ఫెహ్లుక్వాయో (5) కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కుల్దీప్ వేసిన బంతిని రూమ్ తీసుకొని కట్ చేసేందుకు అతను ప్రయత్నించాడు. అయితే బ్యాటు బాటమ్‌ను తాకిన బంతి వికెట్లను కూల్చడంతో అతని ఇన్నింగ్స్ కూడా ముగిసింది. దీంతో సౌతాఫ్రికా జట్టు 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.