కంచు కోట అంటే ఏంటి? అక్కడ మనపై ఎవరూ గెలవలేరని అర్థం. క్రికెట్లో ఇలాంటి కంచుకోటలను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకుంది టీమిండియా. ఆస్ట్రేలియా కంచుకోటగా పేరొందిన ’ది గబ్బా‘ స్టేడియంలో కంగారూలను చిత్తుచేసి చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన.. ఇప్పుడు తాజాగా సఫారీల కంచుకోట ’సెంచూరియన్‘లో కూడా జయకేతనం ఎగరేసింది.
ఇక్కడ సౌతాఫ్రికాపై 113 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కోహ్లీ హయాంలో ఇంటా బయటా గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీమిండియా.. ఎన్నో మైలురాళ్లను అందుకుంది. ఇప్పుడు సెంచూరియన్‌లో సఫారీలను ఓడించిన తొలి ఆసియా కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఈ క్రమంలోనే భారత విజయంతో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. టెస్టు క్రికెట్లో బలమైన జట్లుగా ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా దేశాలను భారతజట్టు.. 2021లో ఓడించిందని ఒకరు గుర్తుచేశారు.
మరొకరేమో వాకా, గబ్బా, సెంచూరియన్ ఈ మూడు కోటలను బద్దలు కొట్టిన ఏకైక ఆసియా దేశం ఇండియానే అని కొనియాడారు. ‘ఇంకేమైనా కోటలున్నాయా?’ అంటూ మరో అభిమాని ప్రశ్నించాడు. ఈ ట్విట్టర్ సెలబ్రేషన్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
India breached two fortress in Test cricket in 2021: Gabba in Australia and Centurion in South Africa – best Test team in the world. pic.twitter.com/QPU9vsZOPV
— Johns. (@CricCrazyJohns) December 30, 2021
India register their first Test victory in Centurion 🎉
— ICC (@ICC) December 30, 2021
They defeat South Africa by 113 runs and go 1-0 up in the series.#WTC23 | #SAvIND | https://t.co/qi2EfKhLHp pic.twitter.com/FXMMb7UVe4
In 2021, India has now beaten four top Test sides
— Mohandas Menon (@mohanstatsman) December 30, 2021
– Australia
– England
– New Zealand
– South Africa#INDvsSA#IndvSA #SAvIND #SAvsIND
Let us know if any other fortress needs to be breached.#INDvsSA pic.twitter.com/OqoZbrjxXx
— yaarivanu_unknownu (@memesmaadonu) December 30, 2021
Congratulations India..!! ❤👈🇮🇳
— Saurabh Tripathi (@SaurabhTripathS) December 30, 2021
Centurian done..Onto the next 🙌#INDvsSA #SAvIND #TeamIndia pic.twitter.com/svFRYjr6Su
#INDvsSA
— Abhishek (@Ingenuity402) December 30, 2021
Centurion – No Asian team has won here#TeamIndia – pic.twitter.com/nUKbfu34Jt
India wins #INDvsSA match,
— Kaagaz Apps (@KaagazS) December 30, 2021
Indian fans right now – pic.twitter.com/aMtoM2bmJ7