సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు పోరాడుతోంది. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (1) అవుటయ్యాడు. దీంతో కష్టాల్లో పడిన భారత జట్టును ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ భారీ షాట్లు ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు.
అయితే పవర్‌ప్లే చివరి ఓవర్ ఐదో బంతికి అతను ఇచ్చిన క్యాచ్‌ను పార్నెల్ జారవిడిచాడు. దీంతో భారత జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి 1 వికెట్ నష్టానికి 42 పరుగులతో నిలిచింది. ఆ తర్వాతి ఓవర్లోనే ఇషాన్ కిషన్ (34) పెవిలియన్ చేరాడు. నోర్ట్జీ వేసిన షార్ట్ బాల్‌ను సరిగా పుల్ చేయలేకపోయిన అతను.. వాన్ డర్ డస్సెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.