బారాబటి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్లు తడబడ్డారు. సఫారీల బౌలింగ్ ధాటికి ఎవరూ సరిగా భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40), దినేష్ కార్తీక్ (30 నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. రుతురాజ్ గైక్వాడ్ (1), రిషభ్ పంత్ (5), హార్దిక్ పాండ్యా (9), అక్షర్ పటేల్ (10) అందరూ విఫలమయ్యారు.
ఈ క్రమంలో భారత్ పోరాడే స్కోరు చేస్తుందా? అని అనుమానం కలిగింది. అయితే చివర్లో దినేష్ కార్తీక్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో ఆన్రిచ్ నోర్ట్జీ రెండు వికెట్లతో సత్తా చాటగా.. రబాడ, వేన్ పార్నెల్, డ్వెయిన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసుకున్నారు.
Innings Break!#TeamIndia post a total of 148/6 on the board.
Scorecard – https://t.co/pkuUUB966c #INDvSA @Paytm pic.twitter.com/fT893ErgVe
— BCCI (@BCCI) June 12, 2022