ఈ నెలాఖరున భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పటిష్టమైన కోహ్లీ సేనను ఎదుర్కొనేందుకు క్రికెట్ సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది. మొత్తం 21 మందితో దక్షిణాఫ్రికా స్క్వాడ్‌ను వెల్లడించింది. ఈ జట్టుకు డీన్ ఎల్గార్ నాయకత్వం వహించనున్నాడు. ఈ ఏడాది జులైలో వెస్టిండీస్ పర్యటనను విజయవంతంగా ముగించుకు వచ్చిన జట్టునే క్రికెట్ సౌతాఫ్రికా ఎంపిక చేసింది.
వీరికితోడు పేసర్ కగిసో రబాడ, క్వింటన్ డీ కాక్, ఆన్రిచ్ నోర్జీని కూడా ఎంపిక చేసింది. వీళ్లతోపాటు చాలా కాలం తర్వాత సీమర్ డుయాన్న ఓలివియర్కు జట్టులో స్థానం కల్పించింది. యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన మ్యాచుల్లో అతను అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఓలివియర్ నిలిచాడు. ఈ క్రమంలోనే అతన్ని కూడా సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.
దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గార్ (కెప్టెన్), టెంబా బవుమా (వైస్ కెప్టెన్), క్వింటన్ డీ కాక్, కగిసో రబాడ, సారెల్ ఎర్వీ, బ్యూరన్ హెండ్రిక్స్, జార్జ్ లిండె, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడీ, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, ఆన్రిచ్ నోర్జీ, కీగన్ పీటర్సన్, రాసీ వాన్ డర్ డస్సెన్, కైలీ వెర్రెన్నీ, మార్కొ జాన్సెన్, గ్లెంటన్ స్టూర్మన్, ప్రెనెలాన్ సుబ్రాయెన్, సిసాండా మగాల, ర్యాన్ రికెల్టన్, డుయాన్న ఓలివియర్.
#Proteas SQUAD ANNOUNCEMENT 🚨
— Cricket South Africa (@OfficialCSA) December 7, 2021
2️⃣ 1️⃣ players
Maiden Test call ups for Sisanda Magala and Ryan Rickelton 👍
Duanne Olivier returns 🇿🇦
Read more here ➡️ https://t.co/ZxBpXXvQy1#SAvIND #BetwayTestSeries #BePartOfIt pic.twitter.com/6rIDzt1PuO