సఫారీ జట్టును బుమ్రా మరోసారి దెబ్బకొట్టాడు. రెండో టెస్టు హీరో డీన్ ఎల్గార్‌ను తొలి రోజే అవుట్ చేసిన అతను.. రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే మరో ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వికెట్లు తీయడంలో విఫలమైనా కూడా కత్తుల్లాంటి బంతులతో బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు.
షమీ రెండు వికెట్లు తీయడంతో క్రీజులోకి వచ్చిన సఫారీ పేసర్ జాన్సెన్ను బౌన్సర్లతో భయపెట్టిన బుమ్రా.. ఆ తర్వాత అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లో జాన్సెన్, బుమ్రా మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటికే సఫారీలు ఏడు వికెట్లు కోల్పోయినా కూడా క్రీజులో అర్ధశతకం చేసిన కీగన్ పీటర్సన్ (72) ఉండటంతో సౌతాఫ్రికా ఆధిక్యం సాధించే అవకాశం కనిపించింది.
అయితే ఆ అవకాశం సఫారీలకు దక్కకుండా బుమ్రా అడ్డుకున్నాడు. ఇన్నింగ్స్ 65వ ఓవర్లో పీటర్సన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఎక్స్ట్రా బౌన్స్ అయిన బంతిని పీటర్సన్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతను విఫలమవడంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫ్ట్ స్లిప్స్‌లో ఉన్న పుజారా వైపుగా వెళ్లింది. మోకాళ్లపై కూర్చొని మరీ పుజారా ఈ క్యాచ్ అందుకున్నాడు. దీంతో బుమ్రా ఈ మ్యాచ్‌లో తన నాలుగో వికెట్ తీసుకున్నాడు.