సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటుతున్నాడు. తొలి రోజు 223 పరుగులకు భారత్ ఆలౌట్ అవగానే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పుడే అద్భుతమైన బంతితో సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గార్ (3) పెవిలియన్ పంపిన బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తర్వాత మరో బ్యాటర్‌ను బుట్టలో వేసుకున్నాడు.
అతని బౌలింగ్‌ను సరిగా అంచనా వేయలేకపోయిన ఎయిడెన్ మార్క్రమ్ (8) బౌల్డ్ అయ్యాడు. దీంతో సఫారీ జట్టు 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే నైట్ వాచ్‌మెన్‌గా బరిలో దిగిన కేశవ్ మహరాజ్ (16 నాటౌట్) చక్కగా ఆడుతున్నాడు. అతనికి కీగన్ పీటర్సన్ (2 నాటౌట్) జత కలిశాడు.
కాగా, తొలి రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (79), వెటరన్ పుజారా (43) రాణించినా మిగతా బ్యాటర్లెవరూ ఆకట్టుకోలేదు. దీంతో భారత జట్టు 223 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.