సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత జట్టు నిరాశాజనకంగా ఆరంభించింది. తొలి టీ20లో బ్యాటర్లు విజృంబించి 211 పరుగుల భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ యూనిట్ విఫలమవడంతో ఓడిపోయింది. సఫారీ ప్లేయర్లు డేవిడ్ మిల్లర్, రాసీ వాన్ డర్ డస్సెన్ ఇద్దరూ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు.
ముఖ్యంగా మిల్లర్.. ఐపీఎల్‌తో తన ఫామ్‌ను కొనసాగిస్తూ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో కటక్ వేదికగా రెండో టీ20కి భారత జట్టు సన్నద్ధం అవుతోంది. ఆదివారం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్మీట్లో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మాట్లాడాడు. ఈ సందర్భంగా మిల్లర్‌కు ఎలా బౌలింగ్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు? అని విలేకరులు అడిగారు.
‘‘మిల్లర్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా జట్టు అతన్ని జట్టులో నుంచి తొలగించాలని కోరుకుంటున్నా. కానీ వాళ్లు ఆ పని చెయ్యరు’’ అంటూ నవ్వేశాడీ బౌలర్. ఐపీఎల్లో మిల్లర్ అద్భుతంగా ఆడాడని, అతను ఏ స్థాయి ఆటగాడో అందరికీ తెలుసునని చెప్పిన భువీ..
అతనికి బౌలింగ్ వేయడం ఎప్పుడూ కష్టమేనని అన్నాడు. అలాగే తొలి టీ20లో భారత బౌలింగ్ దళం పూర్తిగా విఫలమైందని అంగీకరించాడు. అయితే వచ్చే మ్యాచ్‌లో అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా చూసుకుంటామని, సిరీస్ గెలవాలనే లక్ష్యంతోనే ఆడుతున్నామని చెప్పాడు.
How will #TeamIndia approach the second @Paytm #INDvSA T20I at Cuttack? 🤔 🤔
Hear what @BhuviOfficial said 🔽 pic.twitter.com/3LXj8F4t6F
— BCCI (@BCCI) June 11, 2022