IND vs SA 2nd Test: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతన్న రెండో టెస్టులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. బంతి పడితే వికెట్ తీయడమే అన్నంత ధాటిగా సాగుతోంది అతడి విధ్వంసం. సఫారీ టాపార్డర్ మొత్తం సిరాజ్ పేస్‌కు దాసోహమంది. సిరాజ్ విజృంభణతో సఫారీలు 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. వికెట్ కీపర్ వెరీన్ (15) టాప్ స్కోరర్. సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, ముఖేష్ కుమార్ లకు తలా రెండు వికెట్లు దక్కాయి.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికాకు నాలుగో ఓవర్లోనే సిరాజ్ షాకిచ్చాడు. సిరాజ్ వేసిన ఆ ఓవర్లో మార్క్రమ్ (2).. స్లిప్స్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సిరాజ్ తన తర్వాతి ఓవర్లో సఫారీ సారథి డీన్ ఎల్గర్ (4)ను బౌల్డ్ చేసి ఆ జట్టుకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (3) ను బుమ్రా ఔట్ చేశాడు. పదో ఓవర్లో సిరాజ్.. వన్ డౌన్ బ్యాటర్ జోర్జి (2) ను పెవిలియన్ చేర్చాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా.. 10 ఓవర్లలో 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
That’s a 5-FER for @mdsirajofficial 🔥🔥
His first five-wicket haul in South Africa and third overall.#SAvIND pic.twitter.com/lQQxkTNevJ
— BCCI (@BCCI) January 3, 2024
ఐదో స్థానంలో వచ్చిన బెడింగ్హమ్ (12) బుమ్రా వేసిన 11 వ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. ఐదు ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న అతడిని సిరాజ్ ఔట్ చేశాడు. 16వ ఓవర్లో సిరాజ్ వేసిన రెండో బంతికి బెడింగ్హామ్.. జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో సిరాజ్.. ఐదో బంతికి మార్కో జాన్సెన్ (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్‌కు ఇది ఐదో వికెట్. ఈ ఏడాది భారత్ తరఫున టెస్టులలో తొలి ఫైఫర్ సాధించిన బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. దక్షిణాఫ్రికాలో సిరాజ్‌కు ఇదే తొలి ఫైఫర్. మొత్తంగా మూడోవది.
ఇక 18వ ఓవర్లో సిరాజ్.. వికెట్ కీపర్ వెరీన్ (30 బంతుల్లో 15) ను ఔట్ చేయడంతో సఫారీలు ఏడో వికెట్ కోల్పోయారు. తొలి ఓవర్ వేసిన ముఖేశ్ కుమార్.. కేశవ్ మహారాజ్ (3)ను ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా 8 వ వికెట్‌ను కోల్పోయింది. 11 బంతులాడి నాలుగు పరుగులు చేసిన బర్గర్‌ను బుమ్రా ఔట్ చేయగా ఎంగిడిని ముఖేశ్ కుమార్ పెవిలియన్ చేర్చడంతో సఫారీల కథ ముగిసింది. కేప్‌టౌన్ పిచ్‌పై సౌతాఫ్రికాకు టెస్టులలో ఇదే అత్యల్ప స్కోరు.
FIVE WICKET HAUL MOMENT OF SIRAJ. 🔥
– What a bowler. pic.twitter.com/YmZokIx0gj
— Johns. (@CricCrazyJohns) January 3, 2024