కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ శంకరవరప్రసాద్
ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో వింటేజ్ కామెడీని పండించడానికి సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే.
ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో వింటేజ్ కామెడీని పండించడానికి సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుపతిలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌గా తనదైన శైలి వినోదాన్ని పండించారు. ఆయన కామెడీ టైమింగ్, పంచ్‌లు వింటేజ్ చిరుని గుర్తు చేశాయి. కథానాయిక శశిరేఖ (నయనతార), శంకరవరప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చివరలో వెంకటేష్ ఎంట్రీ సర్ప్రైజింగ్గా అనిపించింది.
‘చూస్తుంటే మంచి ఫ్యామిలీమ్యాన్‌లా ఉన్నావు…ఈ మాస్ ఎంట్రీ ఇస్తున్నావేంటి’ అని చిరు అడిగినప్పుడు ‘మాస్కే బాస్‌లా ఉన్నావ్..నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి’ అని వెంకటేష్ చెప్పడం ట్రైలర్లో హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘లీడర్ రాజు, ఆటో జానీ వంటి పాత్రల్లో చిరంజీవి బాగా నచ్చుతారు. ఆ తరహాలో శంకరవరప్రసాద్ క్యారెక్టర్‌ను రాసుకున్నా. సంక్రాంతికి థియేటర్లలో ఓ ఉత్సవంలా ఉంటుందీ సినిమా. చిరంజీవి, వెంకటేష్ వంటి సూపర్‌స్టార్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడటం పండగలా అనిపిస్తుంది’ అన్నారు. సంక్రాంతికి బాక్సాఫీస్‌ను షేక్ చేసే చిత్రమవుతుందని నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

