జగిత్యాల, జనవరి 4: అలిశెట్టి ప్రభాకర్ స్మారక జీవిత సాఫల్య పురసారాని కి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన సినీ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ ఎంపికయ్యారు. అలిశెట్టి యాదిలో ప్రతి ఏటా జనవరి 12న కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్యపీఠం ఆధ్వర్యంలో సాహిత్య అవార్డులు అందిస్తున్నామని అధినేత గుండేటి రాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దింటి అశోక్‌కుమార్‌తోపాటు ఉరిమల్ల సునంద (ఖమ్మం), మెరుగు అనురాధ (హనుమకొండ), లకరాజు శ్రీలక్ష్మి (జగిత్యాల), కోరుకంటి శశికిరణ్మయి (కరీంనగర్), మద్దెల ప్రభాకర్ (జగిత్యాల), మాడూరి అనిత (సిరిసిల్ల), పొద్దుపొడుపు శంకర్ (ముత్తారం), తంగలపెల్లి నవీన్‌కుమార్ (మెట్పల్లి)కు సైతం పురస్కారాలు అందించనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 11న ఉదయం 11గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఫంక్షన్హాల్లో రచయితలకు పురస్కారాలు అందిస్తామని పేర్కొన్నారు. మేధావులు, కవులు, కళాకారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.