IND vs PAK : భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యస్తిక భాటియా (17) ఔట్ అయింది. ఫాతిమా సనా ఓవర్లో యస్తిక ఇచ్చిన క్యాచ్‌ను సాదియా ఇక్బాల్ అందుకుంది. దాంతో, 31 రన్స్ వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ(28) దూకుడుగా ఆడుతోంది. జెమీమా రోడ్రిగ్స్ 7 పరుగులతో ఆడుతోంది. 7 ఓవర్లుముగిసే సరికి భారత్ స్కోర్ 49/1. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 149 రన్స్ చేసింది.