ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్‌కు ముందు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ.. భారత జట్టుకు విషెస్ చెప్పారు. ఆదివారం సాయంత్రం జరగనున్న ఈ మ్యాచ్ సందర్భంగా కరాచీలో తను చూసిన భారత్-పాక్ మ్యాచ్‌ను గుర్తుచేసుకున్న ఆమె.. ఆ మ్యాచ్‌లో భారత్ ఎలా గెలిచింది చెప్పారు.
‘‘జీ జాన్ సే ఖేలియే’’ (మనస్ఫూర్తిగా ఆడండి) అని టీమిండియాకు సందేశం ఇచ్చారు. నెలరోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతోపాటు జింబాబ్వే పర్యటనలో పెద్దగా ఆకట్టుకోని ఓపెనర్ కేఎల్ రాహుల్‌పైనే ఈ మ్యాచ్‌లో అందరి ఫోకస్ ఉంటుందనడం అతిశయోక్తి కాదు.
आज हमारी टीम पाकिस्तान के साथ मैच खेलेगी। #INDvPAK मैच में Team India की जीत को लेकर मैंने अपनी एक special memory शेयर की है।
आप भी भारत की जीत से जुड़ी अपनी यादों को बताएं और Team India का हौसला बढ़ाएं।#AsiaCup
Match Day #IndiaVsPakistan pic.twitter.com/kVGJPZsfMs— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 28, 2022