ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించారు. కీలకమైన వికెట్లు తీసుకున్న వీళ్లకు అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్ నుంచి మంచి సహకారం అందింది. దాంతో పాకిస్తాన్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మహమ్మద్ రిజ్వాన్ (43), ఇఫ్తికర్ అహ్మద్ (28) మాత్రమే రాణించారు. మిగతా ప్లేయర్లు బాబర్ ఆజమ్ (10), ఫఖర్ జమాన్ (10), ఖుష్దిల్ షా (2), షాదాబ్ ఖాన్ (10), ఆసిఫ్ అలీ (9), మహమ్మద్ నవాజ్ (1), నసీమ్ షా (0) ఎవరూ బ్యాటు ఝుళిపించలేకపోయారు.
చివర్లో హారిస్ రవూఫ్ (13 నాటౌట్), షహ్నవాజ్ దహానీ (16) భారీ షాట్లు ఆడటంతో ఆ జట్టు 147 స్కోరైనా చెయ్యగలిగింది. అర్షదీప్ వేసిన చివరి ఓవర్లో దహానీ క్లీన్ బౌల్డ్ అవడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 4, హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ 2 వికెట్లు తీసుకోగా.. ఆవేష్ ఖాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Brilliant bowling figures of 4/26 from @BhuviOfficial makes him our Top Performer from the first innings.
A look at his bowling summary here 👇#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/GqAmcv4su2
— BCCI (@BCCI) August 28, 2022