ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. పాక్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు పేసర్ భువనేశ్వర్ అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. పాక్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను మూడో ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు.
దీని గురించి మాట్లాడిన భువీ.. ‘‘బాబర్ అవుటవగానే పాకిస్తాన్ సగం వికెట్లు కోల్పోయినట్లు కాదు కదా. అతని వికెట్ కీలకమని మాకు తెలుసు. బాబర్ అవుటవడం వల్ల యాంకర్ పాత్ర పోషించాల్సిన బ్యాటర్ ఉండడు. దాంతో పాక్ ప్లాన్స్ అన్నీ తారుమారు అయిపోతాయి’’ అని చెప్పాడు.