Ind VS Pak | ఈ ఏడాది ప్రపంచ కప్ భారత వేదికగా జరుగనున్నది. టోర్నీలో హైవోల్టేజ్ మ్యాచ్ భారత్ – పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నది. దాయాదుల మధ్య జరిగే ఉత్కంఠ పోరు కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌కు ముందే అహ్మదాబాద్‌లోని హోటలళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం అహ్మదాబాద్‌లో అనూహ్యంగా హోటళ్ల ధరలు భారీగా పెరిగాయి. మరో వైపు హోటల్స్ గదులు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ పూర్తి అయ్యాయి. మరో వైపు పలు స్టార్ హోటల్స్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్కో హోటల్లో రేట్లు రూ.1.5లక్షల వరకు పెరిగింది.
ఈ క్రమంలో అభిమానులు మ్యాచ్‌కు హాజరయ్యేందుకు తమ బుర్రకు పని చెబుతున్నారు. మ్యాచ్‌కు హోటల్స్‌లో గదులు దొరక్కపోవడంతో కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మ్యాచ్ జరిగే స్టేడియానికి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్‌లో బెడ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక రోజు వసతి కోసం తమకు విజ్ఞప్తులు వచ్చినట్లుగా స్టేడియానికి దగ్గరలో ఉన్న యాజమాన్యాలు పేర్కొంటున్నారు. అలాగే క్రికెట్ వ్యాఖ్యాత వోహ్రా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే, మ్యాచ్ జరిగే రోజున హాస్పిటల్స్ వసతి కోసం రూ.3వేల నుంచి రూ.25వల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులోనే అహారంతో పాటు పూర్తి మెడికల్ చెపల్ లాంటి వసతులు సైతం ఉన్నట్లు తెలుస్తున్నది.
అయితే, వేలకు వేలు పోసి హోటల్స్‌కు వెళ్లే బదులు హాస్పిటల్‌కు వెళ్లడం మంచిదని చాలామంది భావిస్తున్నారని ఓ హాస్పిటల్ డైరెక్టర్ పేర్కొన్నారు. అక్టోబర్ 15 సమయంలోనే తమకు 24 గంటల నుంచి 48 గంటల వసతి కోసం ఎన్నో వినతలు వస్తున్నాయని ఓ హాస్పిటల్‌కు చెందిన డైరెక్టర్ నిఖిల్ లాలా తెలిపారు. మరో వైపు, అహ్మదాబాద్‌లోనే కాకుండా పక్కనే ఉన్న పలు నగరాల్లోనూ డిమాండ్ హోటల్స్‌కు డిమాండ్ ఉన్నది.
అహ్మదాబాద్ నుంచి కేవలం ఒక గంట దూరంలో ఉన్న వడోదరలో హోటల్ బుకింగ్ ఛార్జీలు అక్టోబర్‌లో సాధారణ ధరల కంటే ఆరు నుంచి ఏడు రెట్లు పెరిగాయి. మ్యాచ్ రోజు దగ్గర పడుతుండడంతో హోటల్స్ గదుల అమాంతం పెరగుతున్నాయి. చాలా రోజుల తర్వాత భారత్ – పాక్ జట్లు పోటీపడబోతున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొన్నది. అయితే, ప్రపంచ కప్‌కు ముందు ఆసియా కప్‌లో భారత్-పాక్ తలపడునున్నాయి. రెండు మ్యాచులు అడే అవకాశాలున్నాయి. టోర్నీ హైబ్రీడ్ మోడల్లో భారత్ మ్యాచులు శ్రీలంకలో జరుగనున్నాయి. దాంతో అహ్మదాబాద్ బ్యాచ్‌కు భారీ డిమాండ్ పెరిగింది.