Rishabh Pant | టీమిండియా, న్యూజిలాండ్ మధ్య పుణే వేదికగా రెండోటెస్ట్ జరుగనున్నది. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌పై హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సమాచారం అందించాడు. పంత్ ఫిట్‌గా ఉన్నాడని.. పుణె టెస్టులో ఆడేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పాడు. బెంగళూరు టెస్టులో రెండోరోజు కీపింగ్ చేస్తున్న సమయంలో పంత్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత పంత్ స్థాన్లో ధృవ్ జురెల్ కీపర్ బాధ్యతలు స్వీకరించాడు. పంత్ మొదటి టెస్టులో బ్యాకింగ్ వచ్చినా.. వికెట్ కీపింగ్‌కు మాత్రం రాకపోవడంతో రెండో టెస్టు ఆడడంపై అనుమానాస్పదంగా మారింది. రెండోటెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ.. పంత్ పూర్తిగా క్షేమంగా ఉన్నాడని.. రెండో టెస్ట్‌లో కీపింగ్ చేస్తాడని తెలిపారు. మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న పంత్ కొద్దిసపు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. మూడు మ్యాచుల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 0-1తో వెనుకబడింది. రెండోటెస్టకు ప్లేయింగ్ 11పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శుభ్‌మాన్ గిల్ సైతం గాయం నుంచి కోలుకున్నాడు.
న్యూజిలాండ్ జట్టులోని ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌ను దృష్టిలో పెట్టుకొని వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ప్లేయింగ్ 11 ఎంపికపై మ్యాచ్ రోజునే నిర్ణయం తీసుకుంటామన్నాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే మూడు మ్యాచులు ఆడాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో బుమ్రాపై భారం పడకుండా చూడాలని బీసీసీఐ భావిస్తున్నది. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు 10-12 రోజుల సమయం ఉంటుందన్నాడు. దాంతో ఫాస్ట్ బౌలర్లకు విశ్రాంతి తీసుకునేందుకు తగినంత సమయం దొరుకుతుందని చెప్పాడు. రెండో టెస్ట్ తర్వాత బుమ్రాపై భారం పడకుండా ఉపశమనం కల్పిస్తారా? లేదా చూడాల్సిందే. అయితే, బుమ్రాతో పాటు ఫాస్ట్ బౌలర్లందరు ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నామని గౌతీ తెలిపాడు.