IND vs NZ : టీమిండియా కెప్టెన్ రోహిత్ వన్డేల్లో 49వ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మిచెల్ శాంటర్న్ బౌలింగ్లో సిక్స్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 38 బంతుల్లోనే 4 సిక్సర్లు, 4 ఫోర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శుభ్మన్ గిల్ అంతకు ముందు శాంటర్న్ ఓవర్లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. గిల్ 55, రోహిత్ 71 పరుగులతో ఆడుతున్నారు. 15 ఓవర్లకు భారత్ స్కోర్ 128/0.