భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. మార్క్ చాప్మన్ (21)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన చాప్మన్ లాంగాఫ్‌లో రాహుల్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 80 పరుగుల వద్ద కివీస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది.
తొలి టీ20లో అద్భుతంగా రాణించిన గప్తిల్, చాప్మన్ ఇద్దరూ పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో డారియల్ మిచెల్ (29 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. తొలి వికెట్‌ను దీపక్ చాహర్ తీసిన సంగతి తెలిసిందే. పది ఓవర్లు ముగిసేసరికి కివీస్ జట్టు 84/2 స్కోరుతో నిలిచింది.