న్యూజిల్యాండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ తన స్పెల్ చివరి ఓవర్లో కివీస్ వికెట్ కీపర్ సేఫెర్ట్ (13)ను పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ బంతిని రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించిన సేఫెర్ట్.. భువనేశ్వర్ కుమార్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
అంతకుముందు ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్.. ప్రమాదకరమైన డారియల్ మిచెల్ (31) వికెట్ తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇదే అతని తొలి వికెట్. కీలక సమయంలో వికెట్ తీసిన అతన్ని టీమిండియా సభ్యులంతా అభినందించారు. కాగా 16 ఓవర్లు ముగిసే సరికి కివీస్ జట్టు 128/4 స్కోరుతో నిలిచింది.