జైపూర్: భారత బౌలర్లపై కివీస్ యువ ఆటగాడు మార్క్ చాప్‌మ్యాన్ (56 నాటౌట్) ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. మంచి బంతులకు సింగిల్స్ తీస్తూ, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ టీమిండియా బౌలింగ్ బృందానికి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్లో సిక్సర్‌తో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే ఫోర్ కొట్టాడు.
తొలి ఓవర్లోనే సీనియర్ మిచెల్ (0) అవుటవడంతో క్రీజులోకి వచ్చిన అతను చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (35 నాటౌట్) కూడా రాణించడంతో 12 ఓవర్లు ముగిసే సరికి కివీస్ జట్టు 96/1తో పటిష్ట స్థితిలో నిలిచింది.