కివీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (63 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆడమ్ మిల్నే వేసిన 11వ ఓవర్లో రెండో బంతినే ఫ్లాట్ సిక్స్ కొట్టిన అతను 40 బంతుల్లో అర్థశతకం పూర్తిచేసుకున్నాడు. ఆ వెంటనే మరో ఫోర్ కొట్టాడు. రాహుల్‌తోపాటు రోహిత్ (37 నాటౌట్) కూడా రాణించడంతో భారత జట్టు 12 ఓవర్లు ముగిసే సరికి వికెట్లేమీ నష్టపోకుండా 105 పరుగులు చేసింది.