IND vs NZ : ఇషాన్ కిషన్ (5) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ల్యూక్ ఫెర్గూసన్ బౌలింగ్ ఫోర్ కొట్టి ఊపు మీదున్న అతను మరుసటి బంతికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో, 110 పరుగల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అంతకు ముందు ఓవర్లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల హాఫ్ సెంచరీ కొట్టాడు. బ్రాస్‌వెల్ ఓవర్లో సిక్సర్ బాది అర్థశతకం సాధించాడు. 52 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. దాంతో భారత్ స్కోర్ 100 దాటింది. అంతకుముందు ఓవర్లో విరాట్ కోహ్లీ(8) తక్కువకే పెవిలియన్ చేరాడు. దాంతో, భారత్ 88 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం గిల్ (58), సూర్యకుమార్ యాదవ్ (4) క్రీజులో ఉన్నారు. 20 ఓవర్లకు భారత్ స్కోర్ 1114/3.