జైపూర్: ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చివరకు విజయం భారత్‌నే వరించింది. న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లలో వరుసగా ఏడు ఓటముల తర్వాత భారత జట్టు విజయఢంకా మోగించింది. మంచు పడే అవకాశం ఉన్న కారణంగా టాస్ గెలిచిన రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. మార్టిన్ గప్తిల్ (70), మార్క్ చాప్‌మ్యాన్ (63) రాణించడంతో 20 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు కేఎల్ రాహుల్ (15), రోహిత్ శర్మ (48) శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (62) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చివర్లో శ్రేయాస్ అయ్యర్ (5), వెంకటేష్ అయ్యర్ (4) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ఉత్కంఠ నెలకొంది. మూడు బంతుల్లో మూడు పరుగులు కావల్సిన పరిస్థితులో ఫోర్ కొట్టిన రిషభ్ పంత్ (17) భారత్‌కు విజయాన్నందించాడు. కివీస్ బౌలర్లలో కెప్టెన్ టిమ్ సౌథీ, శాంట్నర్, డారియల్ మిచెల్ తలో వికెట్ పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు కూల్చాడు.