IND vs NZ : శార్ధూల్ ఠాకూర్ మూడో వికెట్ సాధించాడు. అతని బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దాంతో, కివీస్ సగం వికెట్లు కోల్పోయింది. శతక వీరుడు కాన్వే, బ్రేస్‌వెల్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్లో లాథమ్, మిచెల్‌ను ఔట్ చేసిన శార్దూళ్ కివీస్‌ను దెబ్బకొట్టాడు. 29 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 5 వికటె్ల నష్టానికి 212 చేసింది. కివీస్ విజయానికి ఇంకా 174 రన్స్ కావాలి.