న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన బౌలింగ్‌తో కివీస్ నడ్డి విరిచిన అక్షర్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఐదుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా నిలిచాడు. అక్షర్ ఇప్పటి వరకూ నాలుగు మ్యాచులు ఆడి, ఐదు సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు.
కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో ఈ రికార్డు సాధించాడు. ఇలా ఐదు సార్లు ఐదు వికెట్లు తీయడానికి అతనికి కేవలం నాలుగు మ్యాచులే పట్టింది. ఇంత త్వరగా మరే స్పిన్నర్ కూడా ఈ ఘనత సాధించలేదు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా బౌలర్ హెర్బెర్ట్ హార్డెర్న్ పేరిట ఉండేది. అతను 7 మ్యాచుల్లో ఐదు సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు.