భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిల్యాండ్ జట్టును భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ చివరి బంతికి న్యూజిల్యాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ (6)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. 276/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్ ఓపెనర్లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. అయితే ఒక ఎండ్ నుంచి మహమ్మద్ సిరాజ్, మరో ఎండ్ నుంచి అశ్విన్ బౌలింగ్ దాడి చేయడంతో వాళ్లు ఇబ్బంది పడ్డారు. చివరకు అశ్విన్ బౌలింగ్‌లో లాథమ్ ఎల్బీగా అవుటయ్యాడు. అంపైర్ నిర్ణయాన్ని రివ్యూ కోరినా ఫలితం మారలేదు.
దీంతో టెస్టు క్రికెట్లో అత్యధిక సార్లు లాథమ్‌ను అవుట్ చేసిన బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకూ లాథమ్‌ను అశ్విన్ 8సార్లు అవుట్ చేశాడు. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా 8 సార్లే ఈ కివీ ఓపెనర్‌ను అవుట్ చేసి..ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.