జైపూర్: వెటరన్ స్పిన్నర్ అశ్విన్ మరోసారి మాయ చేశాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బంతి అందుకున్న అతను రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మార్క్ చాప్‌మ్యాన్ (63), గ్లెన్ ఫిలిప్స్ (0) ఇద్దరినీ అశ్విన్ బుట్టలో పడేశాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన చాప్‌మ్యాన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత ఫిలిప్స్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. రివ్యూ కోరినా కూడా ఈ ఫలితం మారలేదు. దీంతో 110 పరుగుల వద్ద కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిల్యాండ్‌ను చాప్‌మ్యాన్, మార్టిన్ గప్తిల్ (42 నాటౌట్) ఆదుకున్నారు.
తొలి వికెట్ భువనేశ్వర్ తీశాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఫామ్‌లో ఉన్న డారియల్ మిచెల్ (0) క్లీన్ బౌల్డ్ చేశాడు.