Anil Ravipudi | వెంకటేష్ సినిమాలో స్టార్ డైరెక్టర్.. అనిల్ రావిపూడి ఇచ్చిన పాత్రకి న్యాయం చేస్తాడా..!
Anil Ravipudi | టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన తొమ్మిది సినిమాలు విజయవంతం కావడంతో.. ఇప్పుడు తన పదో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అనిల్ రావిపూడి తనదైన శైలిలో రూపొందిస్తున్నారు.
Anil Ravipudi | టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన తొమ్మిది సినిమాలు విజయవంతం కావడంతో.. ఇప్పుడు తన పదో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అనిల్ రావిపూడి తనదైన శైలిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. సినిమాలో వెంకటేష్‌తో పాటు కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సంక్రాంతి నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా కామెడీ, యాక్షన్, ఎమోషన్ అంశాలను మేళవిస్తూ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన మార్క్ వన్‌లైనర్ కామెడీకి ఈసారి మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ‘జాతి రత్నాలు’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేవీ అనుదీప్.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అనుదీప్ దర్శకుడిగానే కాకుండా తన కామెడీ టైమింగ్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా ప్రమోషన్లు, పబ్లిక్ ఈవెంట్లలో ఆయన చేసే సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దీంతో ఆయనకు ప్రత్యేకమైన అభిమానగణం ఏర్పడింది.ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి సినిమాలో ఓ విభిన్నమైన పాత్ర కోసం అనుదీప్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కథలో ఆ పాత్ర ప్రాధాన్యతను, తనకు ఉన్న క్యారెక్టరైజేషన్‌ను అనిల్ వివరించడంతో అనుదీప్ కూడా వెంటనే నటించేందుకు అంగీకరించినట్లు టాక్.
అనుదీప్ స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో సినిమాకు అదనపు కామెడీ ఎలిమెంట్ చేరనుందని అభిమానులు భావిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌తో కలిసి ఆయన చేసే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి కూడా ఈసారి తన గత సినిమాలకు భిన్నంగా కామెడీని డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథకు తగ్గట్టుగా వన్లైనర్లు, పాత్రల మధ్య సంభాషణలు, కామెడీ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. అనిల్ రావిపూడి ఇప్పటివరకు వరుసగా తొమ్మిది విజయాలను అందుకున్నారు. దీంతో ఆయన పదో సినిమాపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌కు తోడు కేవీ అనుదీప్ వంటి ప్రత్యేకమైన పాత్రధారి చేరడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
మారుమూల ప్రాంతాలకూ మెరుగైన వైద్యం : మంత్రి సీతక్క
‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

