క్రికెట్ పుస్తకంలోని అన్ని రూల్స్‌ని తనకు అనుగుణంగా వాడుకోవడంలో టీమిండియా వెటరన్ అశ్విన్‌ను మించిన ఆటగాడు మరొకడు ఉండడు. అది మన్కడింగ్ అయినా మరేదైనా సరే. క్రికెట్ రూల్స్‌ను చాలా చక్కగా ఉపయోగించే ఆటగాళ్లలో అతను ఒకడు. ప్రస్తుతం జరుగుగున్న ఇండియా, న్యూజిల్యాండ్ టెస్టు మ్యాచ్‌లో కూడా అతను ఇదే పద్ధతిని ఉపయోగించుకున్నాడు.
రెండో రోజు ఆటలో వికెట్లు లేక అవస్థలు పడిన టీమిండియా బౌలర్లు.. రెండో రోజు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలోనే లాథమ్‌కు బౌలింగ్ చేసే సమయంలో అశ్విన్.. డయాగ్నల్‌గా తన రన్నప్‌ను మార్చుకున్నాడు. దీంతో అంపైర్ నితిన్ మీనన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే తాను క్రికెట్ రూల్స్ వేటినీ ఉల్లంఘించలేదని అశ్విన్ తేల్చిచెప్పాడు.
దీనికి సంబంధించిన స్టంప్స్ మైక్ ఆడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అశ్విన్ తనకు అడ్డొస్తున్నాడని, తాను ఎల్బీడబ్ల్యూ అవుట్ ఇవ్వడం కష్టమవుతుందని మీనన్ చెప్పాడు. దీనికి అశ్విన్ ఘాటు సమాధానం ఇచ్చాడు. ‘మీరు ఎటూ ఇవ్వడం లేదు కదా’ అని బదులిచ్చాడు. అంతకుముందు కివీ ఓపెనర్ టామ్ లాథమ్ (95) ఎల్బీడబ్ల్యూ కోసం అశ్విన్ అప్పీలు చేశాడు. కానీ మీనన్ ఇవ్వలేదు.
అయితే రిప్లేలో అది అవుటని తేలింది. అంతకుముందు మరో ఓపెనర్ యంగ్ (89) అవుట్ విషయంలో కూడా మీనన్ అలాగే చేశాడు.చాలా తక్కువ ఎత్తులో వచ్చిన బంతి.. యంగ్ బ్యాట్‌ను తాకగా, సబ్‌స్టిట్యూట్ కీపర్ కేఎస్ భరత్ దాన్ని అద్భుతంగా అందుకున్నాడు. మీనన్ మాత్రం అది నాటౌట్ అన్నాడు. కానీ భరత్ చాలా కాన్ఫిడెంట్‌గా డీఆర్ఎస్ కోసం వెళల్ాలని డిమాండ్ చేయడంతో రహానే రివ్యూ కోరాడు. దానిలో యంగ్ అవుటైనట్లు స్పష్టంగా కనిపించింది.