IND vs NED: వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతున్న భారత్.. మొదట బ్యాటింగ్‌కు దిగి వీరబాదుడు బాదింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతి బ్యాటర్ అర్థ సెంచరీ కంటే ఎక్కువే పరుగులు చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (54 బంతుల్లో 61, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (32 బంతుల్లో 51, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (56 బంతుల్లో 51, 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలకు తోడు శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్, 10 ఫోర్లు, 5 సిక్సర్లు), కెఎల్ రాహుల్ (64 బంతుల్లో 102, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) లు సెంచరీలతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్.. 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది.
అర్థ సెంచరీల రికార్డు..
బెంగళూరులో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంతగా అనుభవం లేని డచ్ బౌలర్లను టీమిండియా టాపార్డర్ ఆటాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుందా అన్నట్టుగా వచ్చినోళ్లు వచ్చినట్టు బాదడం గమనార్హం. గిల్-రోహిత్‌లు తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలోనే 100 పరుగులు జోడించారు. అర్థ సెంచరీల తర్వాత ఈ ఇద్దరూ నిష్క్రమించినా వన్ డౌన్లో వచ్చిన కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. ఐపీఎల్లో తనకు సొంత గ్రౌండ్అయిన చిన్నస్వామిలో కోహ్లీ 50వ వన్డే సెంచరీ చేస్తాడని ఆశించినా వాండెర్ మెర్వ్ విరాట్‌ను బౌల్డ్ చేశాడు. కోహ్లీ – శ్రేయస్‌లు మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించారు.
కోహ్లీ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన రాహుల్ కూడా ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేయడం గమనార్హం. తద్వారా వన్డేలలో భారత్ అరుదైన ఘనతను నమోదుచేసింది.వన్డేలలో ఇలా టాప్-5 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. వరల్డ్ కప్ చరిత్రలో అయితే ఇదే తొలిసారి.
📸📸 HUNDRED off just 62 deliveries 👏👏
A marvellous knock that from KL Rahul 🔝#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/D6dwgfYE1n
— BCCI (@BCCI) November 12, 2023
అయ్యర్, రాహుల్ దాడి..
అర్థ సెంచరీల తర్వాత అయ్యర్, రాహుల్‌లు నెదర్లాండ్స్ బౌలర్లపై దాడిని మరింత పెంచారు. 40 ఓవర్లకు భారత్ స్కోరు 284 కాగా చివరి పది ఓవర్లలో ఈ ఇద్దరూ 126 పరుగులు రాబట్టారంటే చిన్నస్వామిలో విధ్వంసం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 45 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన అయ్యర్.. తర్వాత సెంచరీ పూర్తిచేసుకోవడానికి 39 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇక 40 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాటిన రాహుల్.. ఆ తర్వాత జోరు పెంచాడు. ఆ తర్వాత 22 బంతుల్లోనే మూడంకెల స్కోరుకు చేరాడు. వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ హండ్రెడ్ (అంతకుముందు ఇదే టోర్నీలో రోహిత్.. అఫ్గాన్‌పై 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు) ఇదే కావడం విశేషం. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 128 బంతుఏల్లో 208 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. మరి భారత బౌలింగ్ దాడిని డచ్ బ్యాటర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి.