వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ఐర్లాండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. బలమైన భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కొంటూ ధాటిగా ఆడారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భువీ వేసిన ఇన్స్వింగర్కు ఆండీ బాల్బిర్నీ (0) డకౌట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే పాండ్యా బౌలింగ్లో పాల్ స్టిర్లింగ్ (4) పెవిలియన్ చేరాడు.
ఆవేష్ ఖాన్ కూడా తానున్నానని నిరూపించుకుంటూ గారెత్ డెలనీ (8)ని అవుట్ చేశాడు. ఇలా 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన హ్యారీ టెక్టర్ (64 నాటౌట్) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చాహల్, భువనేశ్వర్ కుమార్ తప్ప మిగతా అందరి బౌలింగ్లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
అతనికి కాసేపు సహకరించిన కీపర్ లార్కాన్ టక్కర్ (18)ను చాహల్ అవుట్ చేశాడు. చివర్లో వచ్చిన జార్జ్ డాక్రెల్ (4 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడగా.. మరో ఎండ్లో టెక్టర్ చెలరేగాడు. దీంతో నిర్ణీత 12 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్, చాహల్, ఆవేష్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.
Innings Break!
Ireland post a total of 108/4 in 12 overs.#TeamIndia chase coming up shortly.
Scorecard – https://t.co/V1IMXtpJ9X #IREvIND pic.twitter.com/9HfjyFGiCY
— BCCI (@BCCI) June 26, 2022