IND vs ENG | ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. ఇక రెండో జట్టు కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోన్నట్లు తెలుస్తున్నది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేకుండానే ఆడిన ఈ టెస్టులో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైంది. హెడింగ్లీ టెస్టులో ఐదుగురు టాప్ ఆర్డర్స్ బ్యాట్స్‌మెన్ రాణించారు. అయితే, లోయర్ ఆర్డర్ మాత్రం పూర్తిగా తడబడింది. ఇక బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా తప్ప.. మిగతా బౌలర్లు ఎవరూ రాణించలేకపోయారు. ప్రత్యర్థి బ్యాటర్లను బౌలర్లు నిలువరించలేకపోవడంతో టీమిండియాకు భారీ నష్టం జరిగింది.
రోహిత్ స్థానంలో టీమిండియా టెస్టు పగ్గాలు శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ అప్పగించింది. కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే, సిరీస్‌లో ఇది మొదటి మ్యాచ్ కావడంతో భారత్‌కు ఇంకా అవకాశాలున్నాయి. అయితే, లోయర్ ఆర్డర్ రెండు ఇన్నింగ్స్‌లోనూ బ్యాటర్లు సహకరించలేకపోయారు. దాంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణిస్తే పరిస్థితి మరోలా ఉండేది. కనీసం మ్యాచ్‌ను టైగా ముగించే అవకాశం ఉండేది. అదే సమయంలో బౌలర్లు సైతం రెండో ఇన్నింగ్స్‌లో బాగా రాణించలేకపోవడం ఓటమికి ప్రధాన కారణం. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో ఇన్నింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్‌తో తక్కువ బౌలింగ్ చేయించాలనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయాన్ని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సమర్థించాడు. జూలై 2 నుండి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌లో ఎంపిక చేయడం కష్టంగానే కనిపిస్తున్నది. డిసెంబర్ 2023 తర్వాత తన తొలి టెస్ట్ ఆడుతున్న శార్దుల్‌ను ఫాస్ట్ బౌలింగ్‌లో బాగా ఉపయోగించుకోలేదు, బ్యాటింగ్‌తో జట్టును నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 20 బంతుల్లో మొత్తం ఐదు పరుగులు చేశాడు. శార్దుల్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లు, రెండవ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో స్పెషలిస్టళ్ బౌలర్‌గా ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మ్యాచ్ ఐదోరోజు శార్దూల్ వరుసగా రెండు వికెట్లు తీసి భారతదేశం విజయ ఆశలను పెంచినప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం పదును కనిపించలేదు. ప్రసిద్ కృష్ణ కంటే దారుణంగా బౌలింగ్ చేశాడు. ఇంగ్లండ్‌పై ఒత్తిడిని పెంచలేకపోయాడు.
తొలి టెస్టులో టీమిండియా ఎక్కువ ఆధిపత్యం ప్రదర్శించినా.. చివరకు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓటమితో ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయినా.. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ప్లేయింగ్ 11 పలు మార్పులు జరుగనున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ఇంగ్లండ్ ఇక్కడ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో మైదానంలోకి వచ్చింది. కానీ, పొడి వాతావరణం దృష్ట్యా కుల్దీప్, రవీంద్ర జడేజా ఇద్దరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. మ్యాచ్ ఐదోరోజు స్పిన్నర్లకు పిచ్ అనుకూలంగా ఉన్నా జడేజా ప్రభావం చూపలేకపోవడంతో జడేజా బౌలింగ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బౌలింగ్ విభాగంలో ఇతర మార్పులు చేసేందుకు అవకాశాలు కనిపించడం లేదు. తొలి, రెండోటెస్టు మధ్య వారం రోజుల విరామం ఉన్నది. ఈ క్రమంలో బుమ్రా ప్లేయింగ్-11లో ఉంటాడని భావిస్తున్నారు.
మరో వైపు టెస్టుల్లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మళ్లీ జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. టీమ్ మేనేజ్మెంట్ ప్రసిద్ధ్ కృష్ణకే అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నది. తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్ పెద్దగా వికెట్లు పడగొట్టలేకపోయినా.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో రన్ రేట్‌ను నియంత్రించగలిగినా.. వికెట్లు తీయలేకపోయాడు. బౌలింగ్‌తో పాటు, ఏ పరిస్థితిలోనైనా బ్యాట్‌తో సహకారం అందించగల సామర్థ్యం ఉన్నది.