Ind vs Eng Test | ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతున్నది. రెండోరోజు తొలి సెషన్లో నాలుగు వికెట్లు నష్టపోయింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా రెండు పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి రోజు మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండోరోజు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ బ్యాటింగ్ కొనసాగించారు. తొలిరోజు హాఫ్ సెంచరీ చేసిన పంత్.. రెండోరోజు తన కెరియర్లో ఏడో సెంచరీ చేశాడు. ఆ తర్వాత షోయబ్ బషీర్ బౌలింగ్‌లో కెప్టెన్ గిల్ అవుటయ్యాడు. దాంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది.
గిల్ అవుట్ అయ్యాక కరుణ్ నాయర్ సైతం ఎక్కువసేపు క్రీజులో నిలువ లేకపోయాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ టీమిండియాలోకి వచ్చిన నాయర్.. ఖాతా తెరువకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత పంత్ కూడా టంగ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత స్టోక్స్ శార్దుల్ ఠాకూర్‌ను అవుట్ చేశాడు. శర్దూల్ అవుట్ తర్వాత అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఇప్పటి వరకు భారత బ్యాట్స్మన్లలో జైస్వాల్ (101), కేఎల్ రాహుల్ (42), శుభ్‌మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) పరుగులు చేయగా.. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌కు నాలుగు వికెట్లు దక్కగా.. బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్‌కు తలో వికెట్ దక్కింది.