IND Vs ENG T20 | టీమిండియా టార్గెట్ 172 పరుగులు.. ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించిన వరుణ్ చక్రవర్తి..
IND Vs ENG T20 | భారత్-ఇంగ్లాండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. వ
IND Vs ENG T20 | భారత్-ఇంగ్లాండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. వరుణ్ ఐదు వికెట్ల పడగొట్టడంతో ఇంగ్లాండ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఇక ఇంగ్లాండ్ బాట్స్మెన్లలో బెన్ డకెట్ (51), జోస్ బట్లర్ (24) లియామ్ లివింగ్ స్టోన్ (43) రాణించారు. లివింగ్ స్టోర్ సిక్సర్లతో నిరంజన్ షా స్టేడియాన్ని హోరెత్తించాడు. 24 బంతుల్లో 43 పరుగులు చేసిన లివింగ్ స్టోర్ ఒక ఫోర్, ఐదు భారీ సిక్సర్లను బాదాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్ ఫిల్ స్టాల్ (5) తక్కువ స్కోర్‌కే వెనుదిగాడు. ఆ తర్వాత జోస్ బట్లర్, డకెట్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇంగ్లాండ్ 83 పరుగుల వద్ద బట్లర్ పెవిలియన్‌కు చేరాడు.
87 పరుగుల వద్ద బడెట్ అవుట్ అయ్యాడు. అయితే, బెన్ డటెన్ హాఫ్ సెంచరీతో అలరించారు. 28 బంతుల్లోనే 51 పరుగులు చేశారు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల బాదిన డకెట్.. చివరకు అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లివింగ్ స్టోర్ సిక్సర్లతో నిరంజన్ షా స్టేడియాన్ని హోరెత్తించాడు. 24 బంతుల్లో 43 పరుగులు చేసిన లివింగ్ స్టోర్ ఒక ఫోర్, ఐదు భారీ సిక్సర్లను బాదాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే అవుట్ అయ్యారు. ఫిల్ సాల్ట్ (5), హ్యారీ బ్రూక్ (8), జామీ స్మిత్ (6), ఓవర్టన్ (0), బ్రైడన్ కార్సీ (3), జోప్రా ఆర్చర్ (0) పరుగులకే అవుట్ కాగా.. చివరలో ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ చెరో పది పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు. చాలా రోజుల తర్వాత మ్యాచ్‌లో బరిలోకి దిగిన మహ్మద్ షమీకి వికెట్ దక్కలేదు. టీమిండియా జట్టు 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రస్తుతం సంజు శాంసన్ 3, అభిషేక్ శర్మ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

