IND vs ENG | ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచుల్లో శుభ్‌మాన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, యువ కెప్టెన్ తన సామర్థ్యాన్ని చూపించాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ హెడ్‌కోచ్ గ్రెగ్ చాపెల్ పేర్కొన్నారు. అయితే, మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో వెనుకపడింది. ఇప్పుడు కెప్టెన్ గిల్‌కు అసలైన పరీక్ష మొదలైందని చాపెల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకపడింది. ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టు జరుగనున్నది.
ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు రాసిన కాలమ్‌లో చాపెల్.. ‘భారత జట్టు ఇప్పుడు ఇగ్లండ్తో చివరి రెండు టెస్టులకు సిద్ధమవుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అందరి దృష్టి 25 ఏళ్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఉంది. ప్రతిభావంతుడైన యువ ఆటగాడిగా బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నాయకత్వ సామర్థ్యాన్ని సైతం చూపించాడు. కానీ, అతనికి నిజమైన పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. టెస్ట్ కెప్టెన్‌గా అతని దిశను నిర్ణయించే అవకాశం ఇదే’నని రాసుకొచ్చారు. గిల్ తన ప్రదర్శనతో జట్టుకు బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాలని చాపెల్ ఆకాంక్షంచారు. ‘గిల్ భారతదేశం ఎలాంటి జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడో చూపించాలి.
కెప్టెన్ తన మాటల ద్వారానే కాకుండా తన ప్రదర్శన, స్పష్టమైన బెంచ్‌మార్క్‌తో జట్టులో స్వరాన్ని నిర్దేశిస్తాడు. దీని అర్థం జట్టును మైదానంలో క్రమశిక్షణతో ఉంచడం. భారతదేశం మళ్లీ పేలవమైన ఫీల్డింగ్ ఉన్న జట్టుగా చూడలేం. ఉత్తమ జట్లు మైదానంలో అద్భుతంగా ఉంటాయి. వారు సులభంగా పరుగులు ఇవ్వరు. వారు వచ్చిన అవకాశాలను వదులుకోరు’ అని పేర్కొన్నారు. మ్యాచ్‌ను గెలిపించగలరని భావించే జట్టును ఎంపిక చేసుకునే విషయంలో దృఢంగా ఉండాలని చాపెల్ సూచించారు. సెలెక్టర్లు, గిల్ వారు ఎంపిక చేసే ఆటగాళ్లపై విశ్వాసం ఉంచాలని.. వారు అప్పుడే బాగా రాణించగలుగుతారన్నారు.
తమ ప్రణాళికను స్పష్టంగా చెప్పడంతో పాటు ప్రతి ఆటగాడికి తన పాత్ర గురించి తెలియజేయాలని సూచించారు. జట్టులోని ప్రతి ఆటగాడు తన పాత్రను తెలుసుకోవాలని.. తన నుంచి ఏమి ఆశించాలో అతను తెలుసుకోవాలన్నారు. గిల్ గొప్ప టెస్ట్ కెప్టెన్ కావాలనుకుంటే బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే కాకుండా.. కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశమని, స్పష్టమైన ఆలోచన.. దృఢ సంకల్పంతో ముందుకెళ్తే నాయకత్వంతో సిరీస్‌తో పాటు భారత క్రికెట్ భవిష్యత్‌ను సైతం నిర్ణయిస్తాడని చెప్పుకొచ్చారు చాపెల్.