IND vs ENG: లక్నోలో ఇంగ్లండ్‌కు భారత పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా షమీ అయితే ఇంగ్లండ్ బ్యాటర్లను ఆటాడుకుంటున్నాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న ఏకనా పిచ్‌పై క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత్‌ను విజయానికి చేరువ చేస్తున్నాడు. ఆరంభ ఓవర్లలో బుమ్రా, షమీలు ఇంగ్లండ్ టాపార్డర్‌ను దెబ్బతీయగా కుల్దీప్ యాదవ్.. ఇంగ్లీష్ జట్టు సారథి జోస్ బట్లర్ (23 బంతుల్లో 10) ను ఔట్ చేసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు.
లియామ్ లివింగ్‌స్టోన్ తో కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకునేందుకు యత్నించిన మోయిన్ అలీ (31 బంతుల్లో 15)ని షమీ ఔట్ చేశాడు. సెకండ్ స్పెల్‌లో బౌలింగ్‌కు వచ్చిన షమీ వేసిన తొలి బంతికే అలీ.. వికెట్ కీపర్ కెఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం లియామ్ లివింగ్‌స్టోన్‌తో పాటు క్రిస్ వోక్స్‌లు మాత్రమే బ్యాటింగ్ చేయగల సమర్థులు. వీరిలో ఎవరు నిష్క్రమించినా ఇంగ్లండ్ గెలుపు ఆశలు వదిలేసుకోవడమే. 25 ఓవర్ల ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్.. 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి మరో 146 పరుగులు కావాలి.
Caught behind ☝️
Mohd. Shami get his 3⃣rd 😎
Moeen Ali departs and England are now 81/6
Follow the match ▶️ https://t.co/etXYwuCQKP#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/YUVwo04JCB
— BCCI (@BCCI) October 29, 2023