IND vs ENG ODI | నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 19 పరుగులు వద్ద ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యారు. 4.3 ఓవర్ వద్ద ఆర్చర్ బౌలింగ్‌లో ఫిల్ స్టాల్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (15) అవుట్ అయ్యాడు. 5.2 ఓవర్ వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ (2) పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఇటీవల ఫామ్ లేమితో ఇబ్బందులుపడుతున్న రోహిత్.. మరోసారి తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. మహ్మద్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌవుట్ అయ్యింది. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, స్పిన్నర్ రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఇంగ్లాండ్ తరఫున కెప్టెన్ జోస్ బట్లర్, జాకబ్ బెతెల్ అర్ధ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లిష్ జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ తొలి వికెట్‌కు 75 పరుగులు జోడించారు. సాల్ట్ రనౌట్ అవుట్ అయ్యాక.. ఇంగ్లాండ్ తడబడింది. కెప్టెన్ బట్లర్, జాకబ్ బెతెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మిగతా బ్యాటర్స్ ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లాండ్ తరఫున, బట్లర్ 52 పరుగులు, బెతెల్ 51 పరుగులు, సాల్ట్ 43 పరుగులు, డకెట్ 32 పరుగులు చేశారు. ఆ తర్వాత టీమిండియా 249 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది.