Akash Deep | ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శన టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆకాశ్ దీప్ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. తన సోదరి క్యాన్సర్త బాధపడుతోందని.. ఈ ప్రదర్శన ఆమెకు అంకితమిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచుల సిరీస్‌లో భారత్ రెండో మ్యాచ్‌ను 336 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిరీస్‌ను 1-1 తేడాతో టీమిండియా సమయం చేసింది. ఈ మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ పది వికెట్లు పడగొట్టాడు.
తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కూల్చి జట్టును విజయపథంలో నడిపించాడు. మ్యాచ్ తర్వాత ఆకాశ్ దీప్ భావోద్వేగానికి గురయ్యాడు. ఛతేశ్వర్ పుజారాతో మాట్లాడుతూ.. ‘నా సోదరి క్యాన్సర్‌తో బాధపడుతుంది. నేను బంతిని చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ, ఆమె ఆలోచనలు నా మనసులోకి వచ్చేవి. నేను దీని గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ, రెండు నెలల క్రితం నా సోదరికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నా ప్రదర్శన చూసి ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఈ ప్రదర్శన ఆమెకు అంకితం.
మేం అందరం నీతోనే ఉన్నామని సోదరికి చెప్పాలనుకుంటున్నాను’ అని తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్‌తో పది వికెట్ల తీసిన రెండో భారతీయ బౌలర్ ఆకాశ్ దీప్. ఇంతకు ముందు చేతన్ శర్మ ఈ ఘనతను సాధించాడు. 1986 బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో చేతన్ శర్మ 10 వికెట్లు తీశాడు. దాదాపు 39 సంవత్సరాల తర్వాత ఈ రికార్డును నెలకొల్పాడు ఆకాశ్‌దీప్. ఇంగ్లండ్-భారత్ మూడో టెస్ట్ లార్డ్స్ మైదానంలో జరుగనున్నది. మ్యాచ్ ఈ నెల 10-14 మధ్య జరుగనున్నది. ఈ మ్యాచ్‌పై ఆకాశ్ దీప్ స్పందిస్తూ.. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనను ఆస్వాదించాలనుకుంటున్నానని చెప్పాడు. లార్డ్స్ వ్యూహంపై ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు.
Family is everything!
Akash Deep dedicates this win to his sister battling cancer. 🙌#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/teMNeuYLMP
— Sony Sports Network (@SonySportsNetwk) July 6, 2025