తొలిసారి జట్టు పగ్గాలు అందుకున్న కెప్టెన్ బుమ్రా తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అంతకుముందు బ్యాటుతో (16 బంతుల్లో 31 నాటౌట్) ప్రపంచ రికార్డు సృష్టించిన తర్వాత బంతితో కూడా విజృంభిస్తున్నాడు. తర్వాత అలెక్స్ లీస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. లంచ్ తర్వాత బంతి అందుకున్న తొలి ఓవర్లోనే మరో వికెట్ తీశాడు.
మరో ఓపెనర్ జాక్ క్రాలీ (9)ని అవుట్ చేశాడు. బుమ్రా వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి క్రాలీ ప్రయత్నించాడు. కానీ అతను విఫలమవడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ స్లిప్స్‌లో ఉన్న గిల్ వైపు వెళ్లింది. అతను ఎలాంటి పొరపాటు చెయ్యలేదు. దాంతో 27 పరుగుల వద్ద ఇంగ్లండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మాజీ సారధి జో రూట్ క్రీజులోకి వచ్చాడు.
#bumrah 2nd .#INDvsENG pic.twitter.com/E6ZP84FrSo
— MorePractical (@PracticalMore) July 2, 2022