IND Vs ENG ODI | నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 249 పరుగుల టార్గెట్ విధించింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా, స్పిన్నర్ రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్, జాకబ్ బెతెల్ అర్ధ సెంచరీలు సాధించడంతో జట్టు 200పైగా పరుగులు చేయగలిగింది. భారత్ తరఫున హర్షిత్, జడేజా తలా మూడు వికెట్లు పడగొట్టగా, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ దక్కింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు శుభారంభం అందించాయి. ఫిల్ సాల్ట్ (43 పరుగులు), బెన్ డకెన్ (32 పరుగులు) జోడీ తొలి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఎనిమిదో ఓవర్లలో 75 పరుగులతో ఒక దశలో పటిష్టంగా కనిపించిన ఇంగ్లాండ్‌కు 8.5 ఓవర్లలో 75 పరుగుల వద్ద ఫిల్ సాల్ట్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఫిల్‌సాల్ట్ 26 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో బెన్ డకెట్ (32), హ్యారి బ్రూక్ (డకౌట్)గా వెనుదిరిగారు. జోరూట్ (19) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ జోస్ బట్లర్, జాక్ బెతెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిదారు. బట్లర్, జాకబ్ అర్ధసెంచరీలు చేసి పెవిలియన్‌కు చేరారు. ఇక చివరలో జోప్రా ఆర్చర్ రాణించడం (21 నాటౌట్)తో ఇంగ్లాండ్ 248 పరుగులు చేసింది.