క్రికెట్ మ్యాచులు చూడటానికి స్టేడియాలకు వస్తున్న తమ సొంతదేశ అభిమానులు వ్యవహరిస్తున్న తీరుపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. స్టేడియానికి వచ్చే ఇంగ్లండ్ అభిమానులు.. బీర్లు, డ్రగ్స్ తీసుకుని అక్కడ నానా యాగి చేస్తున్నారని.. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారిపై ఈసీబీ గుస్సా అయింది. త్వరలో టీమిండియాతో జరగాల్సి ఉన్న ఐదో టెస్టులో వీళ్లు ఏం రచ్చ చేస్తారో అని ఆందోళన చెందుతున్నది.
సోమవారం ముగిసిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ మూడో టెస్టు (లీడ్స్) లో భాగంగా ఆట నాలుగో రోజు పలువురు అభిమానులు ఫుల్లుగా తాగొచ్చి స్టేడియంలోనే గొడవపడ్డారు. మరికొందరేమో ‘బీర్ స్నేక్’ (బీర్ ను ఒక పైప్ లో పోసి అందరికీ అందించడం) పేరిట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
మరికొంతమంది డ్రగ్స్ కూడా తీసుకుని స్టేడియానికి వచ్చి ఇతరులతో గొడవపడుతున్నారని మ్యాచ్ చూడటానికి వచ్చిన ఇతర ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. వీళ్ల కారణంగా తాము మ్యాచులను ఆస్వాదించలేకపోతున్నామని వాళ్లు స్థానిక పోలీసులకు మొరపెట్టుకున్నారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీబీని కోరారు.
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు అభిమాన సంఘం బర్మీ ఆర్మీ కూడా ఈ ఘటనలను ఖండిస్తున్నది. మ్యాచ్ మధ్యలో ఇలా గొడవ పడటం, డ్రగ్స్ తీసుకుని రచ్చ చేయడం చేయకూడదని వేడుకుంటున్నది. ఇలా చేస్తే బర్మీ ఆర్మీ సభ్యత్వం కోల్పోతారని హెచ్చరించింది.
ఇక జులై 1 నుంచి ఇంగ్లండ్ జట్టు భారత్ తో గతేడాది మిగిలిపోయిన ఆఖరి టెస్టును ఆడాల్సి ఉంది. గతేడాది లార్డ్స్ టెస్టులో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కెఎల్ రాహుల్ పై పలువురు ఆకతాయిలు బీర్, వాటర్ బాటిల్స్ విసిరిన విషయం తెలిసిందే. సిరాజ్ పై కూడా ఇలాగే చేశారు.
తాజాగా ఐదో టెస్టు కోసం కూడా టీమిండియాపై ఇంగ్లండ్ అభిమానులు ఇలాగే వ్యవహరిస్తే తమ పరువు గంగలో కలుస్తుందని భావిస్తున్న ఈసీబీ వాటిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగింది. స్టేడియంలో ఎవరైనా ఇలా గొడవలు చేసినా.. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినా వారి ఆట కట్టించేందుకు గాను ఓ ఫోన్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే వారిపై ఫిర్యాదు చేసిన మరుక్షణమే గ్రౌండ్ సిబ్బంది నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపింది.
I fear England fans are losing interest in the cricket pic.twitter.com/zOnRS45cPV
— Emma Smith (@emmasmithjourno) June 24, 2022
Fans fight savagely while others laugh and cheer them on. The #GAA is a disgrace. Oh wait – this was the England v NZ cricket test, apparently. pic.twitter.com/JzxkzpyBjV
— Frank McNally (@FrankmcnallyIT) June 27, 2022