IND vs ENG ODI | నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీతో అలరించిన కెప్టెన్ జోస్ బట్లర్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వరుసగా వికెట్లు పడిపోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బట్లర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. జాకబ్ బెతెల్ (21నాటౌట్) 50 పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. నాగ్‌పూర్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్‌కు ఫిల్‌సాల్ట్, బెన్ డకెన్ జోడీ అజేయంగా 75 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయింది.
ఫిల్ సాల్ట్ 75 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ అతన్ని రనౌట్ చేయడంతో త్రుటిలో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. ఫిల్ సాల్ట్ 26 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా బౌలింగ్‌లో బెన్ డకెట్ 32 (ఆరు ఫోర్లు), హ్యారీ బ్రూక్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఒక దశలో 75 పరుగులతో పటిష్టంగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 9వ ఓవర్ ముగిసే సరికి కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఇక 18వ ఓవర్లో నాలుగో వికెట్ కోల్పోయింది. 111 పరుగుల వద్ద జోరూట్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 34.3 ఓవర్లలో 180 పరుగులు చేయగా.. జాకబ్ బెతెల్ 28, లియామ్ లివింగ్ స్టోన్స్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. హర్షిత్ రాణాకు రెండు.. జడేజా, అక్షర్ పటేల్‌కు చెరో వికెట్ దక్కింది.