IND vs ENG | 48 ఏండ్ల తర్వాత అరుదైన రికార్డు సృష్టించిన భారత స్పిన్నర్లు
IND vs ENG | తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లంతా భారత స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు వికెట్లను సమర్పించుకున్నారు. కుల్దీప్కు ఐదు వికెట్లు దక్కగా అశ్విన్‌కు నాలుగు, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కించుకున్నాడు.
IND vs ENG | ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత స్పిన్నర్లు ఇంగ్లీష్ ఆటగాళ్లను 218 పరుగులకు కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లంతా భారత స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు వికెట్లను సమర్పించుకున్నారు. కుల్దీప్కు ఐదు వికెట్లు దక్కగా అశ్విన్‌కు నాలుగు, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు తొలిరోజే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడం ద్వారా 48 ఏండ్ల నాటి రికార్డును నెలకొల్పారు.
టెస్టు తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టులో పది వికెట్లూ స్పిన్నర్లకే దక్కడం భారత్‌కు ఇది మూడోసారి మాత్రమే. 1976లో న్యూజిలాండ్‌తో అక్లాండ్ వేదికగా జరిగిన టెస్టులో తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టులో పది వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత ఫస్ట్ డేనే పది వికెట్లు స్పిన్నర్లకే దక్కడం ఇదే మొదటిసారి. 1973లో చెన్నై వేదికగా ఇదే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో కూడా భారత స్పిన్నర్లు ఇదే రికార్డును నెలకొల్పారు.
It’s already looking like England will have a mountain to climb in Dharamsala…https://t.co/ThgzjZgwQU | #INDvENG pic.twitter.com/CHsMcu3SqZ
— ESPNcricinfo (@ESPNcricinfo) March 7, 2024
గురువారం నుంచి మొదలైన ఐదో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్, అశ్విన్, జడేజాల స్పిన్ మాయాజాలంతో 218 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్కు ఐదు వికెట్లు, అశ్విన్‌కు నాలుగు వికెట్లు దక్కగా జడేజా ఒక వికెట్ తీశాడు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి భారత్.. ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (57) అర్థ సెంచరీ సాధించగా.. రోహిత్ శర్మ (52 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (26 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

